శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 9 డిశెంబరు 2017 (22:08 IST)

డిశెంబరు10వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ మీ వార రాశి ఫలితాలు(వీడియో)

కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, కుజులు, వృశ్చికంలో రవి, శుక్రులు, ధనుస్సులో శని, వక్రి బుధులు, మకరంలో కేతువు. సింహ, కన్య, తుల, వృశ్చికంలలో చంద్రుడు. 16 నుంచి ధనుర్ మాసం ప్రారంభం.

కర్కాటకంలో రాహువు, తులలో బృహస్పతి, కుజులు, వృశ్చికంలో రవి, శుక్రులు, ధనుస్సులో శని, వక్రి బుధులు, మకరంలో కేతువు. సింహ, కన్య, తుల, వృశ్చికంలలో చంద్రుడు. 16 నుంచి ధనుర్ మాసం ప్రారంభం.
 
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. మంగళ, శనివారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. బంధువుల ధోరణి మనస్తాపం కలిగిస్తుంది. వాగ్వాదాలు, పంతాలకు పోవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మనస్థిమితం ఉండదు. ఆత్మీయుల రాకతో కుదుటపడతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. 
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
గృహమార్పు యత్నం అనివార్యం. అనవసర విషయాల్లో జోక్యం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గురు, శుక్రవారాల్లో కష్టపడినా ఫలితం అంతంతమాత్రమే ఎదుటివారి వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. త్వరలో శుభవార్త వింటారు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. పెద్ద వ్యాపారులకు పురోభివృద్ధి. పారిశ్రామికవేత్తలకు కొత్త చికాకులు ఎదురవుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.
 
మిథునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3  పాదాలు
ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. ఒత్తిడి, మొహమ్మాటాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వేడుకలు సన్నాహాలు సాగిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. శనివారం నాడు అధికారుల ఇంటర్వ్యూల కోసం పడిగాపులు తప్పవు. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా గుర్తుంచుకోండి. అనవసర విషయాలకు దూరంగా వుండాలి. ఆరోగ్యం సంతృప్తికరం. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. టెండర్లు, భాగస్వామ్యం, ఏజెన్సీలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకరాశి: పునర్వసు 4వపాదం, పుష్యమి, ఆశ్లేష 
మీ సమర్థతను చాటుకుంటారు. కృషి ఫలిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. అవకాశాలు కలిసివస్తాయి. ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు ఉపశమనం లభిస్తుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వేడుకలు, విందు, వినోదాలు, దైవకార్యంలో పాల్గొంటారు. 
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఈ వారం వ్యవహారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలబడదు. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. దంపతుల మధ్య అపోహలు తలెత్తుతాయి. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వొద్దు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. వృత్తి నైపుణ్యం మెరుగుపడుతుంది. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. పెద్దల సలహా పాటించండి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. రావలసిన ధనం అందుతుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆందోళన తొలగిపోతుంది. వేడుకను ఘనంగా చేస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆది, సోమవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం, సంతానం చదువుల పట్ల శ్రద్ధ అవసరం. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. టెండర్లు, ఏజెన్సీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఆశాదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. హోల్ సేల్ వ్యాపారులకు సామాన్యం. దైవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. 
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. కొంత మొత్తం ధనం అందుతుంది. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆలోచనలు నిలకడగా ఉండవు. మంగళ, బుధవారాల్లో ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సర్దుబాటు ధోరణితో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. అధికారులకు వివరణ ఇచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పర్మిట్లు, లైసెన్సుల పునరుద్ధరణలో జాప్యం తగదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు సన్నిహితులే వెనుకాడుతారు. అవసరాలు వాయిదా పడతాయి. గురు, శుక్రవారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆత్మీయుల సలహా తీసుకోండి. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తవుతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరి అసహన కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఆందోళన కలిగించే సంఘటనలెదురవుతాయి. చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహమార్పు కలిసివస్తుంది.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
శ్రమించినా ఫలితం అంతంత మాత్రమే. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. రావలసిన ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. శనివారం నాడు పనులు అస్తవస్త్యంగా సాగుతాయి. ఇబ్బందులు, చికాకులు తాత్కాలికమేనని గ్రహించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కళ, క్రీడా సాంకేతిక, రంగాల వారికి ఆశాజనకం.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
వ్యాఖ్యలు, విమర్శలు ఆలోచింపచేస్తాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ధనలాభం, వ్యవహార జయం పొందుతారు. రుణబాధలు తొలగుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. ఆది, సోమవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. పారిశ్రామికవేత్తలకు అనుమతులు, వనరులు మంజూరవుతాయి. ఉద్యోగ ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. అధికారులకు అదనపు బాధ్యతలు, పనిభారం. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. విజ్ఞతతో వ్యవహరించండి. ఆర్థికలావాదేవీలు లాభిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కీలక పత్రాలు, నగదు జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణానికి అనుకూలం.
 
మీనరాశి: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాలకు అనుకూలం. బంధుమిత్రులు సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మీ వ్యతిరేకతను సున్నితంగా వ్యక్తం చేయండి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆది, గురువారాల్లో ప్రముఖులను కలిసినా ప్రయోజనం ఉండదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు.