శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : శనివారం, 2 జూన్ 2018 (12:20 IST)

జూన్‌‌లో పుట్టారా.. ఐతే మీరు చాలా అదృష్టవంతులే...ఎలాగో తెలుసా?

జూన్‌ నెలలో పుట్టిన జాతకులు చాలా తెలివిగలవారు. కానీ ఏ విషయము నందు ఏకాగ్రత ఉండదు. ఇతరులను ఆకట్టుకునే ఈ జాతకులు సమయానుకూలముగా సంచరింపగలరు. కానీ ఆలోచనాపరులు బుద్ధి స్థిరత్వము మాత్రముండదు.

జూన్‌ నెలలో పుట్టిన జాతకులు చాలా తెలివిగలవారు. కానీ ఏ విషయము నందు ఏకాగ్రత ఉండదు. ఇతరులను ఆకట్టుకునే ఈ జాతకులు సమయానుకూలముగా సంచరింపగలరు. కానీ ఆలోచనాపరులు, బుద్ధి స్థిరత్వము మాత్రముండదు. క్షణ క్షణము మారే అభిప్రాయాలను కలిగివుంటారు. తమ వాక్చాతుర్యము వలన, తెలివితేటల వలన ఇతరులను ఆకట్టుకుంటారు. 
 
జూన్ నెలలో పుట్టినవారికి 27 సంవత్సరాల నుంచి యోగదశ ప్రారంభింపగలదు. 33 సంవత్సరముల నుంచి ధనాన్ని బాగా వెచ్చిస్తారు. టక్కరివాళ్ళు, నీతి, నిజాయితీ గలవారు, సహృదయులు, వేదశాస్త్ర పండితులు, కళాకారులు, రాజకీయవేత్తలు, ప్రభువులు, సేవకులుగా ఉండగలరని సంఖ్యాశాస్త్ర నిపుణులు అంటున్నారు. 
 
ఈ నెలలో జన్మించినవారు అదృష్ట జాతకులు కాగలరు. వీరి హృదయాంతర్గత విషయాలను తెలుసుకోవటం చాలా కష్టం. ఏ సమయంలో ఏమి చెయ్యాలనే విషయంలో ఈ నెలలో పుట్టినవారికి బాగా తెలుసట. వారు ఎవరిమీద ఆధారపడకుండా అనుకున్నది సాధిస్తారు.