Daily Horoscope
✕

ఆదిత్యునికి అలా పూజ చేస్తే...

Written By సిహెచ్
Updated: శనివారం, 4 జులై 2020 (22:53 IST)
పంచాంగంలో ఆదివారం నాడు నియమనిబంధనలున్నాయని జ్యోతిష నిపుణులు చెపుతున్నారు. ప్రధానంగా.. ఆదివారం అనే పదం ఆదిత్య వారం నుంచి పుట్టిదని సాహిత్య నిరూపణము. సంస్కృతమున భానువారంగా పిలువబడుతోంది. భారత దేశములోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో "రవివార్"గా ఇప్పటికీ పిలుస్తున్నారు. కొన్ని దేశ, సంస్కృతులలో ఇది వారాంతంలో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు. 
 
వారంలో మొదటి రోజుగా పరిగణించే ఆదివారం నాడు పాటించాల్సిన కొన్ని నియమనిబంధనలు పరిశీలిస్తే.. ఆదివారం ఉదయాన్నే సూర్యస్త్రోత్రం పఠించడంతో పాటు స్నానమాచరించి సూర్య నమస్కారం చేయడం మంచిదని జ్యోతిష్కులు అంటున్నారు. సూర్యస్తోత్రం తర్వాత ఆలయ దర్శనం గావించి, ఎరుపు పువ్వులు స్వామికి సమర్పించడం ఉత్తమమని వారు పేర్కొంటున్నారు.
 
ఆదివారం రోజున స్త్రీలు తలలో మందారం వంటి ఎరుపు పువ్వులు ధరించడం సౌభాగ్య చిహ్నమని, అదేవిధంగా ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేష్టమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. భానువారమున సూర్యభగవానునికి గోధుమలు, నవధాన్యాలను నైవేద్యంగా సమర్పించినట్లైతే సకల సంపదలు దరి చేరుతాయి.

అన్నీ చూడండి

ఎల్‌నినో పడగ : భారత్‌లో మరణ మృదంగం - మార్చి నాటికి 55 వేల మరణాలు

కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నా...మళ్లీ బీఆర్ఎస్ గూటికి కొండా ఖాయమా?

స్పెయిన్ రైలు ప్రమాదం.. 68కి పెరిగిన మృతుల సంఖ్య... వందమందికి గాయాలు

మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ కోటలో కాంగ్రెస్ జెండా రెపరెపలు

అర్నబ్ ఎఫెక్ట్- నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

అన్నీ చూడండి

29-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు - శుభకార్యం జరిగే అవకాశం ఉంది

28-10-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు

ప్రయాణం చేసే ముందు ఈ మంత్రాలను జపిస్తే...? శుక బ్రహ్మ మహర్షిని?

27-10-2026 రాశి ఫలాలు - శుభవార్తతో ఇంట్లో ఉత్సాహం పెరుగుతుంది

26-10-2026 సోమవారం దిన ఫలాలు - బాకీలను చాకచక్యంగా వసూలు చేసుకోవాలి...

తర్వాతి కథనం
Show comments