1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Good news for Tirumala devotees

తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త.. ఆగస్టు 7 నుంచి 10 వరకు?

garuda seva in tirumala
తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్తను అందించింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది.
 
వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఆగస్టు 7 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మూడు రోజుల పాటు రూ.300 దర్శన టికెట్ల కోటాను గతంలో టీటీడీ నిలుపుదల చేసింది. 
 
అయితే ఆ టిక్కెట్లను ఈరోజు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు 7 నుంచి ఆగస్టు 10 వరకు సంబంధించిన దర్శనం టిక్కెట్లు ఈరోజు భక్తులకు అందుబాటులో ఉంటాయి.
 
కాగా గరుడ పంచమి సందర్భంగా తిరుమలలో మంగళవారం నాడు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
Garuda Panchami 2022: చక్కని సంతానాన్ని ఇచ్చే గరుడ పంచమి