శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జులై 2022 (23:14 IST)

సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

garuda seva in tirumala
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 27న ధ్వజారోహణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. 
 
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీవారికి వాహన సేవలను నిర్వహిస్తామని చెప్పారు.
 
అక్టోబర్ 1న గరుడవాహన సేవ ఉంటుందని, 5న చక్రస్నానం నిర్వహిస్తారని చెప్పారు. అక్టోబర్ 1న గరుడసేవ సందర్భంగా ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలకు అనుమతి లేదని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు.