ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (14:53 IST)

టీటీడీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే ఆయనే రిచ్ గాడ్! (video)

Hundi
Hundi
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారు కానుకల పరంగా మళ్లీ వార్తల్లో నిలిచారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చరిత్రలోనే తొలిసారిగా హుండీ సేకరణ ఆల్ టైమ్ హైగా నమోదైంది. సోమవారం (జూన్ 4) నాడు హుండీ వసూళ్లుగా ఆరు కోట్ల 18 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. 
 
ఈ ఆదాయం ఆల్ టైమ్‌గా నిలిచింది. ఎలాగంటే.. ఏప్రిల్ 1, 2012న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.73 కోట్లుగా వసూలైంది. ఆ సమయంలో ఇదే అత్యధికం. 
 
టీటీడీ గణాంకాల ప్రకారం ఆలయ హుండీ ఆదాయం ప్రతినెలా రూ.100 కోట్లకు పైగానే ఉంది. 2022 మే నెలలోనే టీటీడీకి అత్యధికంగా రూ.129.93 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. కానీ ప్రస్తుత వసూళ్లతో ఈ ఆదాయం తితిదే చరిత్రలోనే అత్యధికంగా నిలిచింది. 
 
దీంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా మరోసారి రికార్డు సృష్టించాడు.