Dharma Sangrah

కార్తీక మాసం గురించి శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో తెలుసా?

Written By సిహెచ్
Updated: మంగళవారం, 28 అక్టోబరు 2025 (15:31 IST)
కార్తీక మాసము గొప్పతనం, దానిని ఆచరించడం వలన కలిగే విశిష్ట ఫలితాల గురించి శ్రీకృష్ణుడు స్వయంగా వివరించినట్లు పద్మ పురాణంలో ప్రస్తావించబడింది. ముఖ్యంగా, శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామకు కార్తీక మాసం యొక్క మహత్యాన్ని ఉపదేశించినట్లు పురాణ గాథ ఉంది. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రధాన అంశాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మాసాలలో కార్తీక మాసమునకు సమానమైన మాసము లేదు. నా కంటే గొప్ప దేవుడు లేడు. వేదములకు సమానమైన శాస్త్రములు, గంగకంటే పుణ్యప్రదమైన తీర్థములు లేవు అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలు... స్నానం, దీపం, పూజ, దానం అనంతమైన పుణ్యాన్ని ఇస్తాయి. ఇతర మాసాలలో చేసిన పుణ్యకార్యాల కంటే ఈ మాసంలో చేసే వాటికి అనేక రెట్లు ఎక్కువ ఫలం ఉంటుంది.
 
కార్తీక మాసంలో దీపారాధన చేయడం అత్యంత ముఖ్యం. ఎందుకంటే, ఈ దీపాలు తమ జీవితంలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. శివాలయాల్లో, విష్ణాలయాల్లో, తులసికోట వద్ద దీపాలు వెలిగించడం శుభకరం. శ్రీ మహావిష్ణువు ఈ మాసంలో దామోదరుడు అనే రూపంలో ఉంటాడు. ఈ నెలలో ఆయనను పూజించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి.

అన్నీ చూడండి

కొబ్బరి చిప్పల సేకరణకు టెండర్లు.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఏం జరిగింది?

ఆహార భద్రతా సమస్యల పరిష్కారం కోసం స్విగ్గీ ప్రత్యేక కస్టమర్ సపోర్ట్, హెల్ప్‌లైన్‌ ప్రారంభం

ప్రధాన కార్యాలయ మార్కెట్లలో హైదరాబాద్ రెండో అత్యధిక REIT నమోదు

బాడీ బిల్డర్‌నని అహంకారమా? మహిళా బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు అరెస్ట్

హరిద్వార్ గంగాఘాట్‌లో టూపీస్‌తో మహిళ స్నానం.. వీడియోపై రచ్చ రచ్చ (video)

అన్నీ చూడండి

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణ ఘట్టంతో ప్రారంభం

15-09-2026 రాశి ఫలితాలు, ఎవరినీ అతిగా విశ్వసించవద్దు

ఆ భయమే మనిషి మనశ్శాంతిని హరించివేస్తుంది: శ్రీ కృష్ణ పరమాత్మ

#HappyVinayakaChavithi : వినాయక చవితి వ్రత కథ - గణపతి జననం

13-09-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకుండా...?

తర్వాతి కథనం
Show comments