మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 9 జూన్ 2018 (21:59 IST)

నందీశ్వరుడు పరమేశ్వరుని ఎదుట ఎందుకు వుంటాడో తెలుసా?

శివుడు అంటే అమంగళాలను సంహరించేవాడు అని అర్ధం. అందువల్లే ఆయన విష్ణువుకు, బ్రహ్మకు కూడా ఆరాధ్యుడయ్యాడు. దేవతల లోని శక్తిని తనలో సంపూర్ణంగా లీనం చేసుకొని అర్ధనారీశ్వరుడి రూపంలో దర్శనమిచ్చేది శివుడు ఒక్కడే. అందుకే శివుడిని పూజిస్తే శక్తిని కూడా పూజించినట

శివుడు అంటే అమంగళాలను సంహరించేవాడు అని అర్ధం. అందువల్లే ఆయన విష్ణువుకు, బ్రహ్మకు కూడా ఆరాధ్యుడయ్యాడు. దేవతల లోని శక్తిని తనలో సంపూర్ణంగా లీనం చేసుకొని అర్ధనారీశ్వరుడి రూపంలో దర్శనమిచ్చేది శివుడు ఒక్కడే. అందుకే శివుడిని పూజిస్తే శక్తిని కూడా పూజించినట్లు అవుతుంది. కోరిన వరాలను కాదనుకుండా ఇస్తాడు కనుకే శివుడికి భోళాశంకరుడు అని పేరు వచ్చింది. అందువల్లనే శివదీక్ష వహించిన వారికి ఏ కోరికైనా సరే అవలీలగా తీరుతుంది. శివానుగ్రహం ఉన్నవాళ్లు మాత్రమే శివదీక్ష వహించగలరు. ఈ శివదీక్ష చేసి అల్పాయుష్కుడైన నందీశ్వరుడు శివుని అనుగ్రహం ఎలా పొందాడో తెలుసుకుందాం. 
 
శివుని యెుక్క గణాలలో నందీశ్వరుని స్థానం అద్వితీయమైనది. ఏ శివాలయం అయినా నందీశ్వరుడు లేకుండా ఉండదు. శివుడు ఉన్నాడు అంటే  నందీశ్వరుడు ఉండి తీరాల్సిందే. నందీశ్వరుడికి అటువంటి భాగ్యం శివదీక్షా ఫలితంగా వచ్చిందే. నందీశ్వరుడి తండ్రి పేరు శిరాదుడు ఈయన మహాశివభక్తుడు. ఈయన సత్సంతానప్రాప్తి కోసం శివదీక్ష వహించాడు. దాని ఫలితంగా నందీశ్వరుడు జన్మించాడు. నందీశ్వరుడు గొప్ప సద్గుణాలతో పెరుగుతూఉన్నాడు. ఒకనాడు నారదుడు వచ్చి ఈ బాలుడు అల్పాయుష్కుడు అని చెప్పి వెళ్లిపోయాడు. అది విన్న నందీశ్వరుడు తండ్రి నుంచి శివదీక్ష, స్వీకరించి శివుడికే ఆత్మార్పణ చేసి సంపూర్ణ నియమనిష్టలతో శివారాధన తత్పరుడు అయ్యాడు. 
 
అతని శివాదీక్షా ఫలం ఎంత గొప్పదంటే కొంతకాలానికి పరమేశ్వరుడే ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. శివాదీక్ష వహించిన వారి యెుక్క మేధాశక్తి అమోఘంగా పెరిగిపోతుంది. నందీశ్వరుడు నాకు ఆయుష్షు పెంచు అని అడుగులేదు. దేవా.. నేను ఎల్లప్పుడు నిన్ను చూస్తూ, నిన్ను సేవిస్తూ ఉండాలి. ఆ వరం నాకు ఇవ్వు అని కోరాడు. నందీశ్వరుడు శివుడి ఎదుట ఉండాలి అంటే జీవించి ఉండాలి కదా. ఎంతకాలం జీవించి ఉండాలి... శివుడు ఉన్నంతకాలం జీవించి ఉండాలి అంటే శివదీక్షాఫలం వల్ల నందీశ్వరుడు చిరంజీవి అయ్యాడు అన్నమాట.
 
శివుడి వరం వల్ల నందీశ్వరుడు నిజంగానే చిరంజీవి అయ్యాడు. చూశారా... శివదీక్ష ఎంతటి మహాఫలాన్ని ఇస్తుందో... చిరంజీవిగా ఉండటం గొప్పకాదు. నిరంతరం ఈశ్వర సేవ చేసుకునే భాగ్యం కూడా శివదీక్ష వల్లే లభించింది. ఆనాటి నుంచి ఈ శివదీక్ష అనేది శివభక్తులలో అనుష్టాన సంప్రదాయంగా పురాణ ప్రసిద్ధిగా వస్తుంది.