సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (12:43 IST)

ప్రదోషకాలంలో అలాచేస్తే.. డబ్బు ఆదా అవుతుందట..

ఈశ్వర ఆరాధన ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చునని అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. లక్ష్మీదేవి చంచలత్వంగా వుంటుంది. చేతికందిన డబ్బు వృధా అవుతోంది. డబ్బు వచ్చే దారి తెలుస్తుంది కానీ.. పోయేదారి మాత్రం తెలి

ఈశ్వర ఆరాధన ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చునని అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. లక్ష్మీదేవి చంచలత్వంగా వుంటుంది. చేతికందిన డబ్బు వృధా అవుతోంది. డబ్బు వచ్చే దారి తెలుస్తుంది కానీ.. పోయేదారి మాత్రం తెలియట్లేదని చాలామంది బాధపడుతూ వుంటారు. అలాంటి వారు మీరైతే.. ఈశ్వర ఆరాధన చేయాలి అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. 
 
రోజూ వెళ్లక కుదరని పక్షంలో సోమవారం ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లి ఆవునేతితో దీపమెలిగించాలి. 108 సార్లు శివాలయ ప్రదక్షిణ చేయడం ద్వారా వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు అయిపోవడాన్ని నివారించుకోవచ్చు. ఇంకా డబ్బు నిలబడట్లేదనే ఆవేదనను తొలగించుకోవచ్చు.
 
ఈశ్వరాధన ద్వారా వచ్చిన డబ్బు ఆదా అవుతుంది. ఇంటి నిర్మాణం, రుణ బాధల నుంచి విముక్తి పొందాలంటే.. ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్లి పూజ చేయాలి. ఆవు నేతితో దీపమెలిగించాలి. 108 సార్లు శివుని చుట్టూ తిరిగితే కనుక డబ్బు సద్వినియోగం అవుతుంది. వృధా ఖర్చు వుండదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.