1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (19:27 IST)

త్యాగయ్య కీర్తనను స్వయంగా వినిన సీతారాములు!

త్యాగయ్య కీర్తనను సీతారాములు స్వయంగా విన్నట్లు పండితులు అంటున్నారు. ఓసారి త్యాగయ్య ఇంటికి మధ్య వయసులో ఉన్న భార్యాభర్తలు వస్తారు. తాము యాత్రీకులమని, వివిధ క్షేత్రాలను దర్శిస్తూ వస్తున్నామంటారు. ఆ గ్రామంలోకి అడుగు పెట్టగానే త్యాగయ్యను గురించి విన్నామనీ, ఆయనని చూడాలనిపించి వచ్చామని చెబుతారు. త్యాగయ్య దంపతులు వాళ్లని సాదరంగా ఆహ్వానిస్తారు. తమ ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్లవలసిందిగా కోరతారు.
 
భోజనాలు అయిన అనంతరం ... వాళ్లు త్యాగయ్య కుటుం పరిస్థితులను గురించి ప్రస్తావిస్తారు. ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా, ఆయన రాజుగారి కానుకలను తిప్పి పంపించడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. తనకి ఏదో కావాలో రాముడికి తెలుసనీ ... ఆయనని కాదని ఇతరులను ఆశ్రయించడం తనకి అలవాటు లేదని త్యాగయ్య చెబుతాడు. 
 
ఆ భార్యా భర్తల కోరికపై శ్రీరాముడిపై ఆయన ఒక కీర్తన ఆలపిస్తాడు. ఆయన గానానికి ఆ భార్యాభర్తలు పరవశించిపోతారు. ఆయన గానం సీతారాముల మనసు గెలుచుకునే ఉంటుందనీ, వాళ్ల అనుగ్రహం తప్పక లభిస్తుందని.. అతిథి మర్యాదకు అనంతరం., వచ్చింది సాక్షాత్తు సీతారాములేనని తెలియక పోయినా త్యాగయ్య వారిని గుమ్మం వరకూ వెళ్లి వాళ్లను సాగనంపుతాడు.