బుధవారం, 27 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (18:00 IST)

శ్రీకృష్ణుడు రథం దిగగానే భగ్గుమని కాలి బూడిదైంది... (video)

శ్రీకృష్ణ పరమాత్ముని లీలలు అన్నీఇన్నీ కావు. ఆ దేవదేవుడు అనునిత్యం ధర్మబద్ధులైన వారిని కాపాడుతూ వుంటారు. భారత యుద్ధం ముగిసిన తర్వాత అర్జునుడు హుందాగా కూర్చోగా రథం నగరానికి వచ్చింది.
 
 
కృష్ణుడు అర్జునుడిని ఓరకంట చూస్తూ "దిగు పార్ధా" అన్నాడు. పార్ధుడు మొహం చిట్లించాడు, చికాకుపడ్డాడు. ఆనవాయితి ప్రకారం ముందుగా సారథి దిగి రథం తలుపు తీసాక వీరుడు దిగుతాడు. దానికి విరుద్ధంగా ముందు సారథి దిగకుండా తనను దిగమనడంతో అర్జనుడికి అర్థం కాలేదు. ఐనా ఆ మహనుభావుడిని ఏమీ అనలేక, అర్జునుడు రథం దిగుతాడు.
 
అర్జునుడు దిగి కొంతదూరం నడిచి వెళ్లాక అప్పుడు దిగాడు కృష్ణుడు. మరు నిముషంలోనే రథం భగ్గున మండి బూడిద అయింది. అదిరిపడ్డాడు అర్జునుడు. యుద్ధంలో ఎన్నో దివ్యస్త్రాలు ప్రయోగించబడినవి. వాటిని తన శక్తి ద్వారా అదిమిపట్టి ఉంచాడు కృష్ణుడు. అందుకే ఆయన దిగగానే శక్తి విడుదలై రథం మండిపోయింది. అదే ముందుగా... కృష్ణుడు రథం దిగిఉంటే? అర్థునుడికి అప్పుడు అర్థమైంది శ్రీకృష్ణుని మాటల వెనుక వున్న అర్థం.