Daily Horoscope
✕

రామానాయుడు బ‌యోపిక్ రానుందా..? వెంకీ రియాక్ష‌న్..?

Written By జె
Updated: సోమవారం, 21 జనవరి 2019 (21:49 IST)
టాలీవుడ్‌లో మహానటి సావిత్రి బయోపిక్ తర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్ రావ‌డం తెలిసిందే. దీంతో బ‌యోపిక్‌ల టాక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఎస్వీఆర్ బ‌యోపిక్ తీస్తే బాగుంటుంద‌ని.. రెబల్ స్టార్ కృష్ణంరాజు అన్నారు. ఎస్వీఆర్ పాత్ర‌కు ప్ర‌కాష్ రాజ్ అయితే న్యాయం చేస్తాడ‌ని చెప్పారు. ఇదిలా ఉంటే... మరికొన్ని బయోపిక్‌లకు కూడా సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామానాయుడు బయోపిక్ పైన అందరి దృష్టి పడింది.
 
తాజాగా రామానాయుడు బయోపిక్ పైన వెంకటేష్ స్పందించాడు. ప్రస్తుతం ఎఫ్2 ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న వెంక‌టేష్‌ని రామానాయుడు బయోపిక్ పైన విలేఖరి అడిగిన ప్రశ్నకు స్పందించారు. ఇంత‌కీ వెంకీ ఏమ‌న్నారంటే... నాన్నగారి బయోపిక్ గురించి ఇంకా ఏమి ఆలోచించలేదు. భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి అని అన్నారు. 
 
తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్‌లకు ఎంత ప్రాధాన్యం ఉందో, నిర్మాతగా రామానాయుడుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మ‌రి.. రామ‌నాయుడు బ‌యోపిక్ త్వ‌ర‌లో తెరపైకి వ‌స్తుందేమో చూడాలి..!

అన్నీ చూడండి

మహారాష్ట్ర అధికార కూటమిలో ఆడియో క్లిప్ కలకలం

అది చేతి రాతనా.. ప్రింటింగా? నేపాల్ యువతికి చేతిరాతతో ప్రపంచ గుర్తింపు

పెళ్లి పేరుతో వివాహేతర సంబంధం - రూ.1.18 కోట్లు వసూలు చేసిన కేటుగాడు

ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న అతి తీవ్ర తుఫాను అర్నాబ్

హమ్మయ్య పులిని పట్టేశారు.. నరభక్షక పులిని పట్టుకున్న సిబ్బంది

అన్నీ చూడండి

25-10-2026 ఆదివారం నాటి రాశి ఫలాలు- అనవసరమైన ఖర్చులకు దూరంగా వుంటే.?

25-10-2026 నుంచి 31-10-2026 వరకు మీ వారఫలాలు - ఎవరినీ తప్పుపట్టవద్దు

కలలో ఏమైనా తింటున్నట్లు చూస్తే.. పండ్ల రసం తాగినట్లు కలగంటే?

24-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు - మాటల్లో సంయమనం పాటించడం మంచిది..

ప్రపంచ ధ్యాన దినోత్సవ పాలక కమిటీ వైస్‌ చైర్మన్‌గా శివకృపానంద స్వామీజీ

తర్వాతి కథనం
Show comments