Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ప్రార్థన ఎంతకాలం కొనసాగాలి? దాని పర్యావసానం ఏమిటి !? (video)

Written By ఎం
Updated: మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (13:16 IST)
ప్రార్థన అంటే స్వార్థంతో మన ఇష్టానికి అనుగుణంగా కాకుండా అంతర్యామిగా ఉన్న ఈశ్వర సంకల్పం మేరకు నడిపించాలని కోరుకోవటం. నిజానికి అలా కోరుకోవటం మనలో శుభేచ్ఛను కలిగించటంకోసమే. శుభేచ్ఛ అంటే ఈశ్వరేచ్ఛ.

అది అర్థమైన తర్వాత ప్రార్థన చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఆ స్థితి కలిగేవరకూ ప్రార్థనగా సాగిన భక్తి ఆ తర్వాత ఆరాధనగా పరిణమిస్తుంది. దైవం ఎడల ఆరాధనాభావం వస్తే ఆత్మీయత ఏర్పడుతుంది. అప్పుడు ప్రతీది దైవంతో చెప్పుకోవడమే కానీ అడగటం ఉండదు. అది చిన్న పిల్లవాడు స్కూల్ కి వెళుతూ 'అమ్మ వెళ్ళొస్తానని' చెప్పటం లాంటిది.

అందులో ఏ కోరిక, ప్రార్ధన లేవు. కేవలం ఆత్మీయతే ఉంది. మనకి కూడా భగవంతునితో అలాంటి ఆత్మీయత వస్తే మనకంటూ ప్రత్యేకంగా ఏ సంకల్పం ఉండదు. అదే శరణాగతి. అప్పుడు దైవంతో ఏకాత్మతాభావనే ఉంటుంది.

అందుకు మనం విశుద్ధ మనస్కులం కావాలి. దైవం అందరిలోనూ సమంగానే ఉన్నా, విశుద్ధ మనస్కుల్లో బాగా ప్రస్ఫుటం అవుతుందని భగవాన్ శ్రీరమణమహర్షి బోధించేవారు. అలా ప్రస్ఫుటమవ్వాలని ఎవరూ కోరుకోనక్కర్లేదు. అందుకే మన ప్రార్థనా విధానమంతా ఒక అంతిమ లక్ష్యంతోనే సాగుతుంది !
 

అన్నీ చూడండి

జీతాలు, పింఛన్ల కోసం రూ. 70,000 కోట్లు ఖర్చు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

కోకా-కోలా బెవరేజెస్ మద్దతు అందించిన ఆర్చర్ గణేష్ 20వ ఆసియా క్రీడల్లో స్వర్ణం, కాంస్య పతకాలు

పాత కాగితాలు సేకరించి జీవనం సాగించే కుటుంబానికి ఇంటి స్థలం

ఆంధ్రలో రూ 40,000 కోట్ల హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన: అనంత్ అంబానీ ప్రసంగం

స్మిత్ తరహాలో నీరజా భానోట్ కాక్‌పిట్ సాహసం.. పాస్‌పోర్టులను చెత్తబుట్టలో వేసి.. 379మందిని..?

అన్నీ చూడండి

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటలు

02-10-2026 రోజు రాశి ఫలాలు - కొత్త పరిచయం అలా ఉపయోగపడుతుంది...

శుక్రవారంతో ఆరుద్ర నక్షత్రం.. ఏ పూజ చేయాలి.. ఎలాంటి దానం ఇవ్వాలంటే?

శబరిమల ఆలయంలో అరవణ, అప్పం ప్రసాదాల తయారీకి హలాల్ బెల్లం వాడారా?

01-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు - ఇంట్లో సంతోషకరమైన వాతావరణం

తర్వాతి కథనం
Show comments