గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 24 మే 2020 (22:22 IST)

రేపు సామూహిక ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తులు లేవు: కృష్ణా క‌లెక్ట‌ర్

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా ఈ నెల 31 వర‌కు లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న నేపథ్యంలో పవిత్ర రంజాన్ సందర్భంగా నిర్వహించే సాముహిక ప్రార్థనలకు (నమాజ్) అనుమతులు లేవని జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ ఆదివారం విడుద‌ల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

లాక్‌డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా మసీదులు, ఈద్గా, మందిరాల్లో సామూహిక ప్రార్థనలకు అనుమతులు లేవన్నారు. మసీదులు, ఈద్గాలకు వెళ్ళకుండా తమ ఇళ్ళల్లోనే కుటుంబ సభ్యులతో కలసి రంజాన్ ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచించారు.

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి భౌతిక దూరాన్ని కొనసాగించడం, రంజాన్ పండుగ సందర్భంగా బంధువులు కలవడం ఈద్ మిలాప్ కార్యక్రమాలు, హ్యాండ్ షేకండ్‌లు (ముసాఫా), ఒకరినొకరు కౌగిలించుకోని అభినందనలు తెలుపుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు.