అయ్యప్పస్వామి దేవాలయంలో దళిత పూజారులు..

కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (టీడీబీ) ఆధ్వర్యంలోని దేవాలయాల్లో దళిత పూజారులు నియమతులు కాబోతున్నారు. 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించాలని కేరళ దేవస్వోమ్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిఫారసు చే

Written By selvi
Updated: శనివారం, 7 అక్టోబరు 2017 (10:54 IST)
కేరళ ట్రావన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (టీడీబీ) ఆధ్వర్యంలోని దేవాలయాల్లో దళిత పూజారులు నియమతులు కాబోతున్నారు. 36 మంది బ్రాహ్మణేతరులను పూజారులుగా నియమించాలని కేరళ దేవస్వోమ్ రిక్రూట్‌మెంట్ బోర్డు సిఫారసు చేసింది. వీరిలో ఆరుగురు దళితులు ఉన్నారు.

పూజారులుగా దళితులను నియమించాలని సిఫారసు చేయడం ఇదే తొలిసారి. పార్ట్ టైమ్ పూజారుల నియామకం కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించినట్లు బోర్డు ప్రకటించింది. 
 
దేవస్వోమ్ మంత్రి కడకంపల్లి రామచంద్రన్ మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపికలో అవినీతికి తావుండరాదని, రిజర్వేషన్ నిబంధనలు, ప్రతిభ ఆధారంగా నియామకాలు జరగాలని చెప్పారు. మొత్తం 62 మంది పూజారుల నియామకానికి బోర్డు సిఫారసు చేసింది. వీరిలో 26 మంది అగ్రకులస్థులు ఉన్నారు. బోర్డు ఆధ్వర్యంలో 1,248 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అయ్యప్పస్వామి దేవాలయం కూడా ఒకటి.

అన్నీ చూడండి

తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Gudivada: కొడాలి నాని సహాయకుడి బర్త్‌డే పార్టీపై దాడి, మద్యం స్వాధీనం

జూబ్లీహిల్స్ భూవివాదం కేసు : ఇద్దరు సినీ నిర్మాతలపై కేసు

SATకు ఎంపికైన ఏకైక బాలిక.. వడ్రంగి కుమార్తె అదరగొట్టింది..

ఆస్తి వివాదం.. అత్తను కూరగాయలు కోసే కత్తితో హత్య చేసిన కోడలు

అన్నీ చూడండి

తిరుమల 7వ మైలు వద్ద శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ.. అలా కనిపెట్టేశారు..

23-07-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

తర్వాతి కథనం
Show comments