suvichar
✕

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటలు

Written By సెల్వి
Updated: శుక్రవారం, 2 అక్టోబరు 2026 (17:42 IST)
Tirumala
తమిళ పురట్టాసి మాసం కారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ పోటెత్తుతోంది. దీని కారణంగా స్వామిని సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి సుమారు 30 గంటల వరకు సమయం పడుతోంది. పురట్టాసి మాసం మూడవ శనివారం, గాంధీ జయంతి, వారాంతపు సెలవు కారణంగా ఏడుకొండల స్వామిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు.
 
తిరుపతి బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ మొదలుకొని, తిరుపతిలోని దేవస్థాన సత్రాలు, ఆలయాలు, ఘాట్ రోడ్లు, అన్నదాన భవనం, తలనీలాలు సమర్పించే ప్రదేశం, లడ్డూ ప్రసాద వితరణ కేంద్రం, వసతి గదులు జారీ చేసే ప్రదేశం, దర్శనాలకు వెళ్లే అన్ని మార్గాల్లోనూ భక్తులు బారులు తీరి వెళ్లడం కనిపిస్తోంది. 
 
తరలివస్తున్న సామాన్య భక్తుల కోసం తిరుపతి దేవస్థానం వీఐపీ బ్రేక్ దర్శనం, ఇతర ప్రత్యేక దర్శన విధానాలను రద్దు చేసినప్పటికీ, అదుపు లేకుండా భక్తులు తిరుమల వైపు వస్తూనే ఉన్నారు. దీని కారణంగా సర్వదర్శనానికి శుక్రవారం 30 గంటల వరకు సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

తిరుపతిలో ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ కాంట్రాక్ట్ ఉద్యోగిని దారుణ హత్య

భయపెడుతున్న మురసు తుఫాను - ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌తో దీపావళి జరుపుకోవచ్చు : సుప్రీంకోర్టు

మురసును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: అధికారులకు సీఎం బాబు పిలుపు

మురసు తుఫాను ప్రభావం : రేపు బాపట్ల జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు

అన్నీ చూడండి

02-11-2026 సోమవారం ఫలితాలు - పనుల్లో శ్రమ, చికాకులు అధికం...

01-11-2026 ఆదివారం నాటి రాశి ఫలితాలు- ఆ మొత్తంలో కొంత దాచుకోవడం మంచిది..

01-11-2026 నుంచి 07-11-2026 వరకు వార ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

01-11-2026 నుంచి 30-11-2026 నవంబర్ మాస ఫలితాలు - యత్నాలు విరమించుకోవద్దు- లక్ష్యానికి చేరువలో ఉన్నారు..

టీటీడీ పాలక మండలి పదవీ కాలం ముగిసింది.. తదుపరి ఛైర్మన్ ఎవరు?

తర్వాతి కథనం
Show comments