సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By tj
Last Updated : బుధవారం, 8 మార్చి 2017 (14:19 IST)

ఎంత రద్దీ ఉన్నా గంటలోపే తిరుమల శ్రీవారి దర్శనం...!

తిరుమల.. ఎప్పుడూ రద్దీ ఉండే ప్రాంతం. శని, ఆదివారాల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు. ప్రతిరోజు 50 వేల మంది భక్తులు ఉంటే శని, ఆదివారాల్లో ఆ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే రద్దీ పెరిగే కొద్దీ గంటల తరబడ

తిరుమల.. ఎప్పుడూ రద్దీ ఉండే ప్రాంతం. శని, ఆదివారాల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు. ప్రతిరోజు 50 వేల మంది భక్తులు ఉంటే శని, ఆదివారాల్లో ఆ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే రద్దీ పెరిగే కొద్దీ గంటల తరబడి వేచి ఉంటున్న పరిస్థితి. చిన్న పిల్లలు, వృద్ధులైతే కంపార్టుమెంట్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి వాటికి స్వస్తి పలికేందుకు టిటిడి కార్యనిర్వహణాధికారి ఒక నిర్ణయం తీసుకున్నారు.
 
కంపార్టుమెంట్ల నుంచి శ్రీవారి సన్నిధికి భక్తులు గంట వ్యవధిలోనే చేరుకునే విధంగా ఆదేశాలిచ్చారు. వైకుంఠం-1 కారిడార్ మీదుగా భక్తులు ఆలయానికి చేరుకుంటారు. కారిడార్‌లో రెండు స్థంబాల కంటే ఎక్కువ మంది నిలబడకుండా కొలబద్ధత పాటించాలి. ఈ మేరకు కొలమానం పాటించే పక్షంలో కంపార్టుమెంట్ నుంచి బయలుదేరిన యాత్రికులు గంటలోపే స్వామివారి సన్నిధికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. 
 
తద్వారా నిరీక్షణ.. అలసట లేకుండా తిరుమలేశుని దివ్యమంగళ రూపాన్నీ వీక్షించే భాగ్యం కలుగనుంది. ప్రస్తుతం పలు కంపార్టుమెంట్లలోకి వేలాదిమంది భక్తులను ఒకేసారి కారిడార్‌లోకి వదులుతున్నారు. వీరంతా కనీసం అంటే మూడు నుంచి నాలుగు గంటల పాటు నెమ్మదిగా కదులుతూ క్యూలైన్లలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. క్యూలైను వేగం మందగిస్తుంది. దీనిపై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో ఈఓ చర్యలు తీసుకున్నారు. ఈఓ ఆదేశించిన విధంగా చేస్తే ఖచ్చితంగా గంటలోనే శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తుంది.