సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2020 (15:42 IST)

కమనీయం.. పద్మావతి అమ్మవారి కుంకుమార్చన

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరస్వామి పట్టపురాణి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవోపేతంగా జరిగింది. ఉదయం నుంచి లక్ష కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరుగుతోంది.
 
వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ ముఖమండపంలో కుంకుమార్చనను టిటిడి నిర్వహించింది. కరోనా కారణంగా ఏకాంతంగానే కుంకుమార్చనను నిర్వహించారు. లోక కళ్యాణార్థం కుంకుమార్చనను నిర్వహిస్తున్నట్లు టిటిడి తెలిపింది.
 
మరో వైపు ఈరోజు సాయంత్రం తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అంకురార్పణ జరుగనుంది. రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం ధ్వజారోహణం కార్యక్రమాన్ని రేపు ఉదయం నిర్వహించనున్నారు. ఆ తరువాత ఏకాంతంగా వాహనసేవలు జరుగనున్నాయి.