శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (08:21 IST)

కార్తీకమాసం: మాస శివరాత్రి.. సాయంత్రం కొబ్బరినూనెతో దీపం.. ఎందుకు?

Lamp
కార్తీక మాసంలో వచ్చే శివరాత్రి రోజున పరమ శివుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహం ప్రసాదిస్తాడని విశ్వాసం. పురాణ శాస్త్రాల ప్రకారం మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం, శివుడిని పూజించడం ద్వారా, చేసిన పాపాలు నశిస్తాయి. ఈ ఏడాది మాస శివరాత్రిని నవంబర్ 29వ తేదీన జరుపుకోనున్నారు. 
 
మాస శివరాత్రి రోజున శివుడు భక్తులు కోరిన కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సుఖ శాంతులు కలుగుతాయి. జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఇంకా ఆర్థికంగా పురోగతి లభించాలంటే కార్తిక మాస శివరాత్రి రోజులు కచ్చితంగా రెండు మంత్రాలు చదవాలని చెబుతున్నారు. 
 
అవేంటంటే.. మొదటి మంత్రం.. "శ్రీ శివాయ.. మహాదేవాయ.. ఐశ్వర్యేశ్వరాయ నమః"
రెండో మంత్రం.."శ్రీం శివాయ నమః "
 
అలాగే కుటుంబంలో మనశ్సాంతి లభించాలన్నా, కలహాలు తొలగిపోవాలన్నా మాస శివరాత్రి రోజున సాయంత్రం పూట కొబ్బరినూనె దీపం వెలిగించాలని సూచిస్తున్నారు. దీపదానం చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయని అంటున్నారు.