బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 డిశెంబరు 2024 (13:19 IST)

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేస్తే అంతే సంగతులు.. టీటీడీ

tirumala
తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. 
 
ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, రాజకీయ ప్రసంగాలకు దూరంగా ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని శనివారం ఓ ప్రకటనలో టీటీడీ పేర్కొంది.
 
నిత్యం గోవింద నామాలతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులు కొంతమంది దర్శనానంతరం ఆలయం ముందు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు.
 
మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు.. విమర్శలు చేయడం పరిపాటిగా మారడంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని టీటీడీ గుర్తించింది.