మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (09:22 IST)

నేను సంఘ విద్రోహినా? వారి విజ్ఞతకే వదిలేస్తున్నా : పరిపూర్ణానంద స్వామి

తనపై సంఘ విద్రోహశక్తి అనే ముద్రవేసి హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడంపై శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు.

తనపై సంఘ విద్రోహశక్తి అనే ముద్రవేసి హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించడంపై శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. పైగా, ఇలాంటి చర్యలతో తన ధర్మపోరాటం ఆగిపోదని, దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో హిందూ ధర్మపరిరక్షణ కోసం పాటుపడతానని ప్రకటించారు.
 
హైదరాబాద్ నగరం నుంచి ఆర్నెల్ల పాటు బహిష్కరించడంతో ఆయన తన సొంతూరైన కాకినాడలోని శ్రీపీఠంకు చేరుకున్నారు. అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వందలాది గ్రామాలను దత్తత తీసుకుని, వెనకబడిన ప్రాంతాల్లోని పిల్లలకు సంధ్యా గురుకులం పేరిట దేశభక్తిని పెంపొందిస్తున్నానని, వందలాది గోవులు, గిత్తలు రైతులకు దానం చేసి గోఆధారిత వ్యవసాయానికి తోడ్పాటునందిస్తున్నానని వివరించారు. 
 
దీనికి ప్రతిగా సంఘ విద్రోహశక్తి నిర్వచనం ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పరిపూర్ణానంద చెప్పారు. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు, దూషిస్తూ పుస్తకాలు రాసిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. వేంకటేశ్వరస్వామి, సుప్రభాతాలపై బాబు గోగినేని పలు అనుచిత వ్యాఖ్యలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం.. కత్తి మహేశ్‌ను బహిష్కరించడం సరికాదని అన్నారు. అనుచిత వ్యాఖ్యలకు దారితీసిన పరిస్థితులను గుర్తించాలని పరిపూర్ణానంద స్వామి కోరారు.