Daily Horoscope
✕

నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - 27 నుంచి వాహన సేవలు

Written By ఠాగూర్
Updated: సోమవారం, 26 సెప్టెంబరు 2022 (09:04 IST)
బ్రహ్మాండనాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరుగనుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు చేపట్టే అంకురార్పణను సోమవారం చేస్తారు. 
 
శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనుని పర్యవేక్షణలో ప్రారంభమయ్యే అంకురార్పణ కార్యక్రమాలు రాత్రి 7 గంటల నుంచి 8 వరకు నిర్వహిస్తారు. రాత్రి ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, మృత్తికను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే 'మృత్సంగ్రహణ యాత్ర' (పుట్టమన్ను సేకరణ) అంటారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని అంకురార్పణగా పేర్కొంటారు. 
 
స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడు రాత్రి 7 గంటలకు ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరి పడమర మాడవీధి నైరుతి మూలలో ఉన్న వసంత మంటపానికి వేంచేస్తారు. అక్కడ అర్చకస్వాములు నవపాలికల్లో పుట్టమన్నును సేకరించి మిగిలిన మాడవీధుల మీదుగా ఊరేగుతూ ప్రదక్షిణగా ఆలయానికి వస్తారు. 
 
యాగశాలలో కైంకర్యాలతో పాటు పాలికలలోని పుట్టమన్నులో నవధాన్యాలను మొలకెత్తింపజేసే అంకురార్పణ (బీజవాపం) ప్రక్రియను వైదికంగా నిర్వహిస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లవుతుంది. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనాలతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 

అన్నీ చూడండి

నవంబర్ 12.. తెలంగాణ, ఏపీ వాతావరణం ఎలా వుందంటే..?

తెలంగాణ విద్యా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పు- సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

సోనియా బయోగ్రఫీ ఆధారంగా సినిమా తీస్తా : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

ఒకచోట 58 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు.. విశాఖలో 31వ సీఐఐ సదస్సు

సీఎం విజయ్ పార్టీ టీవీకే ప్రజాప్రతినిధులా? ఏకంగా కలెక్టర్‌కే అసభ్య మెసేజ్?

అన్నీ చూడండి

12-11-2026 గురువారం నాటి రాశి ఫలితాలు.. అనవసర ఖర్చులను నియంత్రించాలి..

శంఖాన్ని ఇంటి గుమ్మం దగ్గర ఉంచితే... వాస్తు దోషం మటాష్... శుక్రవారం ఇలా..?

11-11-2026 బుధవారం నాటి రాశి ఫలితాలు.. సహచరులతో సమన్వయం పాటిస్తే?

Sashti Viratham 2026: స్కంధ షష్ఠి వ్రతం ప్రారంభం.. ఆరు రోజులు ఉపవాసం వుంటే... ఫలితం ఏంటి?

10-11-2026 మంగళవారం ఫలితాలు - సన్నిహితులు వ్యాఖ్యలు కార్మోన్ముఖులను చేస్తాయి...

తర్వాతి కథనం
Show comments