తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - సర్వదర్శనానికి 12 గంటలు...

శనివారం, 14 మే 2016 (10:52 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి తిరుమల గిరులలో ఇదే పరిస్థితి. సెలవు దినాలతో పాటు 10వ తరగతి పరీక్షా ఫలితాలు రావడంతో అధికసంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శనివారం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. 
 
అలాగే కాలినడక భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 8 గంటలకుపైగా సమయం పడుతోంది. తలనీలాలతో పాటు గదుల కోసం భక్తులు తిరుమలలో పడిగాపులు కాస్తున్నారు. ప్రోటోకాల్‌ వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనాలను తితిదే మంజూరు చేస్తోంది. మిగిలిన వారి సిఫార్సు లేఖలను తితిదే స్వీకరించడం లేదు. శుక్రవారం శ్రీవారిని 74,350 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.59 కోట్లు వచ్చింది. 

అన్నీ చూడండి

Revanth Reddy: మనవడికి స్వయంగా పూరీలు చేసిపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి (video)

ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకుని తమను వదిలేయాలంటూ ప్రాధేయపడిన మహిళ

పోక్సో కేసు : బండి భగీరథ్‌కు బెయిల్

శిక్షణ ఇస్తూనే విమానం నుంచి దూకి ఆత్మహత్య

వైజాగ్ టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : భర్త శ్రీచరణ్, అత్తమామలకు సమన్లు

అన్నీ చూడండి

09-07-2025 బుధవారం ఫలితాలు - పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి...

08-07-2025 మంగళవారం ఫలితాలు - తొందరపాటు నిర్ణయాలు తగవు....

ఈ పంచ కన్యల శ్లోకం స్మరిస్తే మహాపాతకాలు పోతాయ్

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?

జూలై 7, 2026: కాలాష్టమి.. తేనె రాసిన జిల్లేడు ఆకులు.. నైవేద్యంగా రెండు గులాబ్‌జామూన్‌లు..?

తర్వాతి కథనం
Show comments