Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పల్లవోత్సవం, 30సంవత్సరాల తరువాత...

Written By జె
Updated: గురువారం, 29 జులై 2021 (23:14 IST)
తిరుమలలో పల్లవోత్సవం వేడుకగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టిటిడి పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూర్ సంస్ధానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.
 
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్ధానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మైసూర్ ప్యాలెస్ మహారాణి ప్రమోదాదేవి వడయార్ 30యేళ్ళ తరువాత ఈ పల్లవోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
 
ఎంతో వేడుకగా కార్యక్రమం జరిగింది. అధికసంఖ్యలో భక్తులు పల్లవోత్సవాన్ని తిలకించారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూనే టిటిడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కోవిడ్ తగ్గుముఖం పడుతుండడంతో తిరుమలలో స్వామివారికి సంబంధించిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి.

అన్నీ చూడండి

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా : అభిజీత్ దీప్కే

ఫ్రీ బస్సుల్లో సీట్ల లొల్లి - జట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు (వీడియో)

సెల్ ఫోన్ రిపేర్ కోసం ర్యాపిడో బైక్ పైన వెళ్తున్న యువతిని ఢీకొట్టిన బస్సు, మృతి

మంత్రి పదవి పోయినందుకు బాధలేదు.. కానీ అకారణంగా తొలగించడం బాధగా ఉంది : కొండా సురేఖ

ఎన్ని అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు : కొండా మురళి

అన్నీ చూడండి

13-09-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకుండా...?

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

12-09-2026 శనివారం మీ రాశి ఫలితాలు.. ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టాలి

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?

జీవితంలో పైకి ఎదగటానికి, నాశనం కావడానికి ఆ రెండే మార్గాలు, శ్రీకృష్ణుడు చెప్పిన సత్యాలు

తర్వాతి కథనం
Show comments