శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జులై 2021 (12:43 IST)

పిండి పదార్థంతో చేసిన సంచుల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. శ్రీవారి ప్రసాదాలు ఎన్ని రకాలు ఉన్నా లడ్డూ ప్రసాదం ప్రత్యేకతే వేరు. ఈ క్రమంలో ఈ లడ్డూ ప్రసాదాలను ఇకనుంచి ఓ ప్రత్యేకమైన కవర్ ప్యాకింగ్‌లో అందించనుంది టీటీడీ. ఆ కవర్ పర్యావరణహితమైనది. భూమిలో చాలా త్వరగా కలిసిపోతుంది. కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీలు తయారు కావడంతో వాటిని ఉపయోగించేందుకు టీటీడీ అంగీకరించింది.
 
ప్లాస్టిక్ కవర్లు భూమిలో కలవటానికి వందల ఏళ్లు పడుతుంది. ఇటువంటి కవర్ల వల్ల పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతోంది. దీంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్లాస్టిక్‌ కవర్ల స్థానంలో కేవలం కూరగాయల వ్యర్థాలు, తిండి గింజల నుంచి సేకరించిన పిండి పదార్థంతో ఈ సంచీ (ఎకొలాస్టిక్‌)లు తయారు కావడంతో వాటిని ఉపయోగించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థకు చెందిన అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లేబొరేటరీ డైరెక్టర్‌ రామ్‌ మనోహర్‌ బాబు తెలిపారు.