మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : గురువారం, 12 మే 2016 (10:11 IST)

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఒక్కసారిగా 25 సర్వదర్శనం కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం, బుధవారం రద్దీ మోస్తారుగా ఉన్నా గురువారానికి భక్తుల సంఖ్య పెరిగింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 6 గంటలకుపైగా దర్శన సమయం పడుతోంది. 
 
అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 3 గంటలకుపైగా సమయం పడుతోంది. గదులు కూడా దొరకని పరిస్థితి తిరుమలలో కనిపిస్తోంది. 50, 100 ఉచిత గదులన్నీ నిండిపోయాయి. కళ్యాణకట్ట వద్ద కూడా భక్తుల తాకిడి కనిపిస్తోంది. బుధవారం శ్రీవారిని 71,185 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2.26 కోట్లుగా వసూలేంది.