శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 18 డిశెంబరు 2017 (19:09 IST)

తిరుమలలో ప్రారంభమైన టైం స్లాట్.. గంటన్నరలోనే శ్రీవారి దర్శనం(వీడియో)

శ్రీవారి భక్తులు నమ్మలేని నిజమిది. టిటిడి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో భక్తులకు త్వరితగతిన దర్సనభాగ్యం లభించనుంది. ఇందుకోసం భక్తులు చేయాల్సింది ఏమిటంటే... వారు తిరుమలకు వచ్చేటప్పుడు ఆధార్ కార్డును తీసుకొస్తే సరిపోతుంది. నడక దారిన గాని, లేకుంటే

శ్రీవారి భక్తులు నమ్మలేని నిజమిది. టిటిడి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో భక్తులకు త్వరితగతిన దర్సనభాగ్యం లభించనుంది. ఇందుకోసం భక్తులు చేయాల్సింది ఏమిటంటే... వారు తిరుమలకు వచ్చేటప్పుడు ఆధార్ కార్డును తీసుకొస్తే సరిపోతుంది. నడక దారిన గాని, లేకుంటే వాహనాల ద్వారా గాని, తిరుమలకు ఎలా వచ్చినాసరే ఆధార్ కార్డు ఉంటే చాలు గంటన్నరలోనే తిరుమల శ్రీవారి దర్సనభాగ్యం లభిస్తుంది.
 
సాధారణంగా భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి వుండి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎప్పుడు దర్సనం లభిస్తుందో తెలియక కంపార్టుమెంట్లో వేచి ఉంటారు. అయితే ఇక అలాంటి పరిస్థితి ఉండదు. ఆధార్ కార్డు తీసుకెళ్ళిన వెంటనే టైం స్లాట్ ను కేటాయిస్తారు. ఆ సమయానికి కంపార్టుమెంట్‌కు వెళితే చాలు చాలా త్వరగా దర్శనం లభిస్తుంది. 
 
రద్దీ సమయాల్లో అయితే 4 గంటల సమయం పట్టొచ్చు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌తో పాటు జెఈఓ శ్రీనివాసురాజులు టైం స్లాట్ విధానాన్ని ప్రారంభించారు. టిటిడి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.