సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Updated : ఆదివారం, 22 మే 2016 (16:16 IST)

బూందీ పోటు కేంద్రంలో ఈఓ సాంబశివరావు ఆకస్మిక తనిఖీలు

తిరుమల తిరుపతి దేవస్థాన్ కార్యనిర్వహణాధికారి సాంబశివరావు శనివారం తిరుమలలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గత వారంరోజుల నుంచి రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈఓ తిరుమలలోని వైకుంఠం-1, వైకుంఠం-2 కాంప్లెక్స్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 
 
కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులతో ఈఓ మాట్లాడారు. అలాగే లడ్డూ తయారు చేసే బూందీ పోటును కూడా పరిశీలించారు. పోటులోని కార్మికులతో ఈఓ మాట్లాడారు. ఈఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో తితిదే సిబ్బంది హైరానా పడ్డారు.