Daily Horoscope
✕

తితిదే అద్దె గదుల బుకింగ్‌లో కొత్త నిబంధనలు

Written By ఠాగూర్
Updated: బుధవారం, 15 జనవరి 2020 (15:43 IST)
తిరుమలలో అద్దె గదుల కేటాయింపులో ఇప్పటివరకు ఉన్న నిబంధనను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి మార్పులు చేసింది. ఇకపై అద్దె గదుల బుకింగ్‌లో క్యాష్ ఆన్ డిపాజిట్ విధానాన్ని తక్షణం అమల్లోకి తెస్తున్నట్టు తెలిపింది. 
 
ఇందులోభాగంగా ఆన్‌లైన్ మాధ్యమంలో గదిని బుక్ చేసుకునే భక్తులు, ముందుగానే రెట్టింపు మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి వుంటుందని పేర్కొంది. గదిని ఖాళీ చేసిన తర్వాత ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి ఇస్తామని తెలియజేసింది.
 
ఇకపోతే, ఆఫ్‌లైన్‌లో అంటే, తిరుమలకు వచ్చి అక్కడి కౌంటర్లలో గదులను బుక్ చేసుకునే భక్తులకు, ఈ నెలాఖరు నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని, భక్తులు గమనించాలని కోరింది. 
 
కాగా, గతంలో తిరుమలలో అద్దె గదుల బుకింగ్‌నకు ఇదే విధానం అమలులో ఉండేది. ఆపై చంద్రబాబు ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏ రోజు గదికి అదే రోజు అద్దె చెల్లించే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు తిరిగి పాత విధానంలోకి తీసుకొచ్చింది. 

అన్నీ చూడండి

తొమ్మిది నెలల్లో రూ.56 లక్షలు.. ఇంటి వంటకు క్రేజ్.. 55,000కు పైగా భోజనాలను డెలివరీ

70మంది యువతులను ఆన్‌లైన్‌లో వేధించిన భారతీయ విద్యార్థికి 30 ఏళ్ల జైలు శిక్ష

AP Panchayat Polls: ఈసారి ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా గుర్తు..

14 ఏళ్ల బాలికను కారులో కిడ్నాప్, దుండగుల కోసం ఊరంతా వెంబడించింది, తర్వాత?

గిగ్ వర్కర్స్ కోసం బోర్డు... వైఫై విశ్రాంతి కేంద్రాలు, బీమాతో పాటు కొత్త చట్టం.. రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

శబరిమల: చాలకాయం-పంబ మార్గానికి రూ.15 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు

కార్తీక శుక్ల పంచమి.. లక్ష్మీ పంచమి, లాభ పంచమి రోజున కొత్త వ్యాపారాలు చేస్తే?

14-11-2026 - శనివారం నాటి రాశి ఫలితాలు.. అనవసర ఖర్చులను నియంత్రించాలి

నవంబర్ 14 నుంచి 30 వరకు కోటి దీపోత్సవం- కోటి కుంకుమార్చన, కోటి గాజుల అర్చన

13-11-2026 రాశి ఫలాలు - ఆరోగ్యపరంగా చిన్నపాటి అలసట ఉన్నా..?

తర్వాతి కథనం
Show comments