ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (14:46 IST)

కొత్త సంవత్సరం: శ్రీవారి ఆలయం అందం.. స్వామివారి ప్రతిరూపం అద్భుతం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లీలలు అన్నీ ఇన్నీ కావు. ఎందెందు వెతికినా అందందు కలడు స్వామివారు. స్వామివారిని పూజిస్తే అనుకున్నది నెరవేరుతుందనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఎంతో వ్యయప్రయాసలతో భక్తులు అశేషంగా తిరుమలకు తరలివస్తుంటారు. ఆ స్వామివారిని దర్సించుకుంటుంటారు. 
 
నూతన సంవత్సరం రోజు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో స్వామివారి ఆలయం విరాజిల్లుతోంది. నూతన సంవత్సరం రోజు స్వామివారిని దర్సించుకుంటే ఆ యేడాది మొత్తం ప్రశాంతంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుందని భక్తుల నమ్మకం. అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు.
 
అర్థరాత్రి ఏకాంత సేవ తరువాత తెల్లవారుజాము నుంచి పలువురు విఐపిలు స్వామివారిని దర్సించుకున్నారు. ఆ తరువాత సర్వదర్సనం లైన్ ను టిటిడి అధికారులు వదిలారు. మొత్తం 30కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. గోవిందనామస్మరణలతో తిరుమల మాఢావీధులు మారుమ్రోగుతున్నాయి. తిరుమల ప్రధాన మార్గం వద్ద నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ హోర్డింగ్ ను టిటిడి ఏర్పాటు చేసింది. అలాగే అక్కడక్కడ కూడా హోర్డింగ్ లు దర్సనమిస్తున్నాయి.