మంగళవారం, 20 జనవరి 2026
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 31 డిశెంబరు 2019 (21:56 IST)

న్యూ ఇయర్ పాలకోవా... టేస్ట్ చేయండి

పాలకోవా చేసేందుకు కావలసినవి
మీగడ తీయని పాలు - ఒకటిన్నర లీటరు
పంచదార - నాలుగు టేబుల్ స్పూన్లు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు - కొద్దిగా
యాలకుల పొడి - చిటికెడు
 
తయారీ విధానం: ఒక మందపాటి పాన్ తీసుకుని పాలు పోసి చిన్నమంటపై మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో మధ్యమధ్యలో కదుపుతూ వుండాలి. మరుగుతున్న సమయంలోనే కుంకుమ పువ్వు వేయాలి. పాలు మరిగి చిక్కబడుతున్న సమయంలో రంగు మారతాయి. పాలు కాస్త చిక్కబడిన తర్వాత యాలకుల పొడి, పంచదార, నెయ్యి వేసి కలియబెట్టాలి. పంచదార వేసిన తర్వాత మిశ్రమం కాస్త పలుచబడుతుంది. మరికాసేపు చిన్నమంటపై ఉంచితే చిక్కటి మిశ్రమంగా మారుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మరో పాత్రలోకి మార్చుకుని సర్వ్ చేసుకోవచ్చు.