శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By మనీల
Last Modified: గురువారం, 3 అక్టోబరు 2019 (16:26 IST)

రవ్వ లడ్డు తయారీ విధానం..

కావలసిన పదార్థాలు: 
బొంబాయిరవ్వ - పావుకిలో
వేయించిన శనగపిండి - పావుకిలో
పంచదార - అరకిలో
నెయ్యి - 200 గ్రాములు
జీడిపప్పు - 50 గ్రాములు
యాలకులు - 6
ఎండుకొబ్బరి - ఒక చిప్ప 
 
తయారుచేయండి ఇలా:
మొదట జీడిపప్పును కొద్దిగా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నెయ్యినిలో రవ్వను వేసి, లైట్ బౌనిష్ వచ్చే వరకు వేయించి ప్రక్కన వెట్టుకోవాలి. రవ్వ మొరుముగా వుంటే రోటిలో దంచాలి. ఇప్పుడు స్టౌ మీద పాత్ర ఉంచి, అందులో కొంచెం నీళ్లు పోసి, పంచదారనూ కలిపి తీగపాకం పచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఆ పాకంలో పక్కన పెట్టుకున్న రవ్వ, జీడిపప్పు,  శనగపిండి, ఎండుకొబ్బరి, యాలకులను కలిపి కొద్ది వేడిమీద ఉండలుగా చేయాలి. ఇవి 4 రోజులపాటు నిలువ వుంటాయి. పాకం బాగా కుదిరితే రవ్వలడ్డు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఆవకాయలాగా ఆంధ్రులకు రవ్వలడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదుకదా మరి..