శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (11:12 IST)

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. 30 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు

శ్రీశైలం ఉగాది మహోత్సవాలకు ముస్తాబువుతోంది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు స్వామివారికి విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు, వాహనసేవలు, ప్రభోత్సవం, రథోత్సవం, వీరాచార విన్యాసాలు, పంచాంగ శ్రవణం, పండిత సత్కార కార్యక్రమాలు ఘనంగా జరిపించనున్నట్లు శ్రీశైల ఆలయ అధికారులు వివరించారు. 
 
ఉగాది ఉత్సవ ప్రారంభం రోజున యాగశాల ప్రవేశంలో మొదలై ప్రతి రోజు ఉదయం హోమజప కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సాయంత్రం వేళలో వాహనసేవల్లో స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులకు దర్శమిస్తారని తెలిపారు. ఉగాది పర్వదినాన దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పంచాంగ పఠన కార్యక్రమం ఉంటుందని  ఈవో లవన్న చెప్పారు. 
 
అదే రోజు సాయంత్రం జరిగే రథోత్సవంలో అమ్మవారైన భ్రమరాంబ రమావాణి సహిత రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తారు. అదే విధంగా మహోత్సవాల్లో ఆఖరి రోజున నిజరూపాలంకరణలో భ్రమరాంబ అమ్మవారు దర్శనం ఇస్తారని ఈవో వివరించారు.