1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 18 మార్చి 2022 (17:39 IST)

భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు

భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. అంతేగాకుండా ఏప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా నవమి ఉత్సవాల పనులను ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అలాగే పసుపు దంచే కార్యక్రమం జరిగింది. ఏప్రిల్ 9న సీతారాములకు ఎదుర్కోలు ఉత్సవం, 10న కల్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరుగనున్నాయి. 
 
ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రానున్నారు. గోటి తలంబ్రాలను భక్తులు తెచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంకా శ్రీరామ వివాహ మహోత్సవానికి తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి.