సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (18:16 IST)

యాదాద్రీశ్వ‌రుడి భక్తులకు గమనిక: 28న ఉదయం 11.55 గంటలకు..?

యాదాద్రి స్వామివారి స్వయంభువుల దర్శనాలు ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణతో ప్రారంభం అవుతాయని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. అలాగే ఈ నెల 28వ తేదీ నుంచి బాలాలయంలో కాకుండా ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి ల‌భించ‌నుంది. 
 
ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహిస్తామని.. 108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువు ఉంటుందన్న ఈవో.. మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారని వెల్లడించారు. 
 
21 నుండి 28 వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బాలాలయంలో పూజా కార్యక్రమాలు ఉంటాయని.. 28వ తేదీన సంప్రోక్షణ అనంతరం బాలాలయంలోని స్వామివారి ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తీసుకెళ్తారు.