ఆసియా కప్ ఫుట్‌బాల్.. జ్యోతిష్యుడి సలహా మేరకు జట్టు ఎంపిక.. ఆపై?
గత సంవత్సరం జరిగిన ఆసియా కప్ ఫుట్‌బాల్‌లో భారత క్రీడాకారుల ప్రతిభను ఆధారం కాకుండా పరీక్షించకుండా, జ్యోతిష్యులను సంప్రదించి ఆటగాళ్ల రాశి ఫలాలను పరిశీలించి ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాశమైంది.
గత ఏడాది ఆసియా కప్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో భారత జట్టు ఆడే క్రమంలో భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధికారి ప్రమేయంతో జ్యోతిష్యుడిని కోచ్ ఇగోర్ స్టిమాక్ సంప్రదించాడు. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లకు ముందు జ్యోతిష్యలను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్ల రాశులను బట్టి వారి ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది.
గత సంవత్సరం జూన్ 11వ తేదీన జరిగిన ఆప్ఘనిస్థాన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆటలో పాల్గొనేందుకు భారత ఆటగాళ్ల ప్లేయింగ్-11 జాబితా విడుదలైంది. ఈ జాబితా విడుదలయ్యేందుకు రెండు రోజులకు ముందుగా భారత కోచ్ జ్యోతిష్యులను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జ్యోతిష్యుడి సలహా ప్రకారమే జట్టు ఎంపిక జరిగింది.
జ్యోతిష్యుడు చెప్పినట్లు ఆప్ఘన్‌పై భారత జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. ఇంకా, భారత జట్టు విజయం కోసం సలహా అందించిన కారణంగా రూ.15 లక్షల సన్మానం అందించబడింది. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది.