శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (11:44 IST)

డిసెంబర్ 16న సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహం..?

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా, పారుపల్లి కశ్యప్‌లు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ఇద్దరి వివాహం కానున్నట్లు సన్నిహితుల సమాచారం. ఈ మేరకు ఇరు కుటుంబ పెద్దలు డేట్స్ ఫిక్స్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా, పారుపల్లి కశ్యప్‌లు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ఇద్దరి వివాహం కానున్నట్లు సన్నిహితుల సమాచారం. ఈ మేరకు ఇరు కుటుంబ పెద్దలు డేట్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది డిసెంబర్ 16న వీరి వివాహం జరుగనుందని.. 21న రిసెప్షన్ జరుగనుంది.
 
అలాగే పెళ్లి కేవలం వందమంది సమక్షంలోనే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. 2005లో బ్యాడ్మింటన్ క్రీడాకారులైన ఈ ఇద్దరు హైదరాబాద్‌లోని గోపిచంద్ అకాడమీలో కలిశారు. కొన్ని సంవత్సరాల పాటు స్నేహితులుగా వున్న వీరిద్దరూ.. ఆపై ప్రేమికులుగా మారారు. దాదాపు పది సంవత్సరాల పాటు ఈ ఇద్దరూ ప్రేమలో వున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. 
 
ఈ క్రమంలో పలుమార్లు వీరు కెమెరాలకు చిక్కినా.. ఇద్దరూ తమ మధ్య బంధాన్ని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. ప్రస్తుతం తమ ప్రేమ బంధాన్ని పెళ్లితో ముడిపెట్టి ఒక్కటవ్వనున్నారు. త్వరలో సైనా మెడలో కశ్యప్ తాళిబొట్టు కడతాడని.. వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరుగనుందని సన్నిహితులు వెల్లడించారు. 
 
ఇప్పటికే 32 ఏళ్ల పారుపల్లి కశ్యప్ 2013 బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ గేమ్స్‌ (2014)లో స్వర్ణ పతకం సాధించాడు. ఇక 28 ఏళ్ల సైనా నెహ్వాల్.. 2015లో టాప్-1లో నిలిచింది. కామన్వెల్త్ 2010, 2018లో స్వర్ణపతకం సాధించింది. 2012 ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.