శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (12:20 IST)

ఆసియా క్రీడలు : కాంస్యంతో సరిపెట్టుకున్న సైనా నెహ్వాల్

ఆసియా క్రీడల్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. ఈ క్రీడల్లో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో బ్య

ఆసియా క్రీడల్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కాంస్య పతకంతో సరిపుచ్చుకుంది. ఈ క్రీడల్లో భాగంగా తొమ్మిదో రోజైన సోమవారం మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ సెమీ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమి పాలయ్యారు.
 
చైనా షట్లర్‌ తై జూయింగ్‌ చేతిలో 0-2 తేడాతో సైనా నెహ్వాల్‌ ఓడిపోయారు. సెమీస్‌లో ఓటమితో సైనా నెహ్వాల్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నారు. దీంతో మహిళల సింగిల్స్‌లో బంగారు పతకంపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి.