మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (19:09 IST)

ట్విట్టర్‌ పందెంలో ఓడిన సూపర్ బ్యూటీ... ముక్కూమొహం తెలియని అభిమానితో డేటింగ్‌కు సిద్ధం

కెనడాకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ యుజిని బౌచర్డ్‌. వయసు 22 యేళ్లు. ఈమె సూపర్‌ బౌల్‌ సిరీస్‌లోని అట్లాంటా ఫాల్కన్స్‌- న్యూఇంగ్లాండ్‌ పేట్రియాట్స్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై ట్విట్టర్‌లో ఓ అభిమానితో పందెం కా

కెనడాకు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ యుజిని బౌచర్డ్‌. వయసు 22 యేళ్లు. ఈమె సూపర్‌ బౌల్‌ సిరీస్‌లోని అట్లాంటా ఫాల్కన్స్‌- న్యూఇంగ్లాండ్‌ పేట్రియాట్స్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై ట్విట్టర్‌లో ఓ అభిమానితో పందెం కాసింది. ఈ పందెంలో ఓడిపోయింది. పందెంలోని బెట్టింగ్ ఒప్పందం మేరకు.. ఆ అభిమానితో డేటింగ్‌ చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
అట్లాంటా ఫాల్కన్స్‌ 21-0తో లీడ్‌లో ఉండటంతో బౌచర్డ్‌ ట్విట్టర్‌లో అట్లాంటా జట్టు మ్యాచ్‌ గెలుస్తుందని ట్వీట్‌ చేసింది. అయితే ఓ అభిమాని పేట్రియాట్స్‌ జట్టు గెలిస్తే నాతో డేట్‌కు వస్తావా అని అడిగాడు. అందుకు బౌచర్డ్‌ 'తప్పకుండా' అని సమాధానమిచ్చింది. అయితే సూపర్‌స్టార్‌ టామ్‌ బ్రాడీ అద్భుతమైన ఆటతో అనూహ్యంగా పేట్రియాట్స్‌ విజయం సాధించింది. దీంతో ఆ అభిమాని 'ఆందోళన పడుతున్నారా?' అంటూ ట్వీట్‌ చేశాడు.
 
'అవును.. కొంచెం..' అని సమాధానమిచ్చి 'నువ్వు ఎక్కడ ఉంటావ్‌?' అని బౌచర్డ్‌ అడిగింది. తర్వాత తాను అభిమానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని డేట్‌ తర్వాత ట్వీట్‌ చేసింది. అలాగే టామ్‌ బ్రాడీకి వ్యతిరేకంగా ఎప్పుడూ బెట్‌ వేయొద్దని గొప్ప గుణపాఠం కూడా నేర్చుకున్నానంటూ బౌచర్డ్‌ మరో ట్వీట్‌ ద్వారా తెలిపింది.