1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 18 మే 2016 (11:15 IST)

యువకులకు లైంగిక వేధింపులు.. హైదరాబాద్ క్రికెట్ కోచ్‌పై కేసు నమోదు

క్రికెట్ నేర్చుకోడానికి వచ్చిన పలువురు యువకులపై కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చందానగర్ పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొంత కాలంగా సలామ్ అనే వ్యక్తి  క్రికెట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నాడు. 
 
కాగా, కోచింగ్‌కు వచ్చిన ఐదుగురు విద్యార్థులపై (12 నుంచి 16 ఏళ్లు) లైంగిక చర్యలకు పాల్పడుతుండేవాడు. విశ్రాంతి సమయంలో ఆ విద్యార్థులను తన గదికి పిలిపించుకుని లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతి రావు వెల్లడించారు. 
 
దీంతో అతనిపై ఐపీసీ 377, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం నిందితుడిపై తగుచర్యలు తీసుకుంటామని అధికారి చెప్పారు.