బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 31 మే 2022 (15:44 IST)

నేను అబ్బాయినైతే బాగుండేది, ఆ నొప్పి వుండేది కాదు కదా: చైనీస్ క్రీడాకారిణి కిన్వెన్

Qinwen Zheng
ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్ 1 ఇగా స్వియాటెక్ చేతిలో ఓడిపోయిన చైనీస్ టీనేజ్ కిన్వెన్ జెంగ్, ఋతుక్రమ నొప్పి కారణంగా చివరి దశల్లో తను ఓటమి పాలైనట్లు చెప్పింది. మొదటి రౌండ్లో ఇగాకు చుక్కలు చూపించిన కిన్వెన్ రెండో రౌండ్ వచ్చేసరికి వెనకబడిపోయింది. దీనికి కారణంగా ఆమెకి రుతుక్రమ నొప్పి మొదలవడమే. 19 ఏళ్ల క్రీడాకారిణి అమ్మాయిల విషయాలు గురించి మాట్లాడుతూ... ఋతు చక్రంలో స్త్రీలు పడే కష్టాల గురించి నిరాశను వ్యక్తం చేసింది.

 
ప్రపంచ ర్యాంక్‌లో 74వ ర్యాంక్‌లో ఉన్న జెంగ్, రెండో సెట్‌లో 3-0తో మెడికల్ టైమ్‌అవుట్‌ను తీసుకోవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె వెన్నుపూసకు మసాజ్ చేసి, కుడి తొడకు పట్టీ వేసారు. ఐనప్పటికీ ఆమెకి చికిత్స పెద్దగా ఉపయోగపడలేదు. వరుసగా ఎనిమిది గేమ్‌లను వదులుకోవలసి వచ్చింది.

 
కిన్వెన్ జెంగ్ మాట్లాడుతూ... మొదటి సెట్‌లో నాకు కడుపు నొప్పి అనిపించలేదు, కాబట్టి నేను బాగా ఆడాను. ఆ తర్వాత నాకు కడుపు నొప్పి ప్రారంభమైంది. ఐనా పంటి బిగువున పోరాడి గెలవాలనుకున్నా. ఐతే నా రుతుక్రమ నొప్పి ముందు ఓడిపోయాను. నా ప్రదర్శనతో నేను నిజంగా సంతోషంగా లేను. నేను అబ్బాయినైతే బాగుండేది, ఆ నొప్పి నాకు వుండేది కాదు కదా" అంటూ చెప్పింది.