పరుగుల రాణి పీటీ ఉషపై కేరళ పోలీసుల చీటింగ్ కేసు
భారత పరుగుల రాణి పీటీ ఉషపై కేరళ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషతో పాటు మరో ఆగురుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు కోళికోడ్ పోలీసులు వెల్లడించారు.
కాగా, జెమ్మా జోసెఫ్ కోజికోడ్‌లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డర్ నుంచి కోనుగోలు చేసింది. ఆ ఫ్లాట్ కోసం జోసెఫ్ వాయిదాల రూపంలో మొత్తం రూ.46 లక్షలు చెల్లించింది. అయినప్పటికీ ఫ్లాట్‌ను బిల్డర్ జోసెఫ్‌కు అప్పగించలేదు.
పీటీ ఉష హామీ మేరకు బిల్డర్‌కు తాను పూర్తి డబ్బులు చెల్లించానని కానీ, తనకు ఫ్లాట్‌ను అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బిల్డర్‌తో పాటు.. పీటీ ఉష తమను మోసం చేశారని జోసెఫ్ పేర్కొనడంతో కేసు నమోదు చేశారు.