మలేషియా మాస్టర్స్ సెమీఫైనల్లోకి పీవీ సింధు.. సైనా నెహ్వాల్ రికార్డు సమం
ఆక్సియాటా ఎరీనాలో జరిగిన మలేషియా మాస్టర్స్, బీడబ్ల్యూఎస్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఏస్ షట్లర్ పీవీ సింధు మూడు గేమ్‌లలో టాప్ సీడ్ చైనీస్ హాన్ యూని ఓడించి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
అష్మితా చలిహా చైనాకు చెందిన ఆరో సీడ్ జాంగ్ యి మ్యాన్‌తో వరుస గేమ్‌లలో ఓడి క్వార్టర్‌ఫైనల్ పోరును ముగించింది. 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన తర్వాత తొలి టైటిల్‌పై గురిపెట్టిన సింధు 21-13 14-21 21-12తో ప్రపంచ నెం.6 యూపై విజయం సాధించింది.
కాగా, సింధుకిది కెరీర్‌లో 452వ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన షట్లర్‌గా సైనా నెహ్వాల్ (451) రికార్డును సింధు అధిగమించింది.