మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (08:53 IST)

ఎందుకు ఓడిపోతున్నామో అర్థం చేసుకోండి.. విమర్శించొద్దు : సానియా మీర్జా

దేశానికి పతకం కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానన్న ఒక్క విషయాన్ని అభిమానులు ఎన్నడూ మరవరాదని సానియా మీర్జా కోరింది.

రియో ఒలింపిక్స్ క్రీడల్లో టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుల ఆటతీరు పేలవంగా సాగుతోంది. ఫలితంగా ఇప్పటికే స్టార్ ఆటగాడు లియాండర్ పేస్, స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా (మహిళల డబుల్స్ విభాగం)లో చిత్తుగా ఓడిపోయారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై సానియా మీర్జా స్పందించారు. 
 
మైదానంలోకి దిగిన తర్వాత కేవలం శక్తి మేరకు ఆట చూపగలమే గానీ, గెలుస్తామా? ఓడిపోతామా? అన్న విషయాన్ని ఎవరూ చెప్పలేరన్నారు. గెలుపు, ఓటములు ఆటలో భాగమేనని, తనను విమర్శించడం మాని, ఈ విషయమై నిజాన్ని తెలుసుకోవాలని సూచించింది.
 
తన నుంచి భారత్ ఏం ఆశిస్తోందో తెలుసునని, పతకం తీసుకువచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయని తెలిపింది. మిక్సెడ్ డబుల్స్‌లో బోపన్నతో కలసి ఆడుతున్నానని గుర్తు చేసిన సానియా, పతకం పడతానన్న ధీమా వ్యక్తం చేసింది. దేశానికి పతకం కోసం తన శక్తి మేరకు కృషి చేస్తానన్న ఒక్క విషయాన్ని అభిమానులు ఎన్నడూ మరవరాదని సానియా మీర్జా కోరింది.