శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 8 జనవరి 2017 (14:12 IST)

తొలి టైటిల్ గెలిచినా సానియా మీర్జా.. అయినా నంబర్ వన్ ర్యాంకు పాయె...

భారత టెన్నిస్ ఏస్ సానియా మీర్జా తన మొదటి ర్యాంకును కోల్పోయింది. ఈ సీజన్‌లో తొలి టైటిల్ నెగ్గినప్పటికీ, వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కోల్పోవడం గమనార్హం. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నమెంటులో వరల్డ్ నంబర్ 2

భారత టెన్నిస్ ఏస్ సానియా మీర్జా తన మొదటి ర్యాంకును కోల్పోయింది. ఈ సీజన్‌లో తొలి టైటిల్ నెగ్గినప్పటికీ, వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కోల్పోవడం గమనార్హం. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నమెంటులో వరల్డ్ నంబర్ 2 జోడీ ఎకతిరినా మకరోవా, ఎలీనా వెస్నినా జోడీతో తలపడిన సానియా, బెతానీ మటేక్ జోడీ, 6-2, 6-3 తేడాతో గంటా 16 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో విజయభేరీ మోగించింది. 
 
అయినప్పటికీ, వరల్డ్ నంబర్ వన్ డబుల్స్ ప్లేయర్‌గా సానియాకు ఉన్న ర్యాంకు ఈ మ్యాచ్ తర్వాత బెతానీ వశమైంది. ఇటీవలి కాలంలో బెతానీ మెరుగైన ప్రదర్శన కనబరచడమే ఇందుకు కారణం. కాగా, గత సంవత్సరం మార్టినా హింగిస్‌తో కలసి ఇదే బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో సానియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.