శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (13:11 IST)

టైటిల్ గెలిచాడు.. బాక్సింగ్ రింగ్‌లోనే వెస్ట్ గార్త్ మృతి.. ఎలా?

టైటిల్ గెలిచిన ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాడు. టైటిల్ గెలిచిన కాసేపటికే బ్రిటిష్ బాక్సర్ స్కాట్ వెస్ట్ గార్త్ నిజ జీవితంలో ఓడిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని డాన్ కాస్టర్‌లో ఇంగ్లీష్ హెవీ వెయ

టైటిల్ గెలిచిన ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాడు. టైటిల్ గెలిచిన కాసేపటికే బ్రిటిష్ బాక్సర్ స్కాట్ వెస్ట్ గార్త్ నిజ జీవితంలో ఓడిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని డాన్ కాస్టర్‌లో ఇంగ్లీష్ హెవీ వెయిట్ బాక్సింగ్ టైటిల్ ఫైట్ జరిగింది. ఈ పోటీలో హెవీ వెయిట్ బాక్సింగ్ విభాగంలో విజేతగా నిలిచాడు.
 
బాక్సింగ్ రింగ్‌లోనే గెలుపు సంబరాలు చేసుకున్న వెస్ట్ గార్త్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ ఇచ్చేందుకు యాంకర్ వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో గుండెనొప్పి బాధపడిన అతడు.. క్షణాల్లోనే ఉన్నపళంగా నేలపై కుప్పకూలిపోయాడు. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తరువాత 10 ఫైట్లు చేసిన వెస్ట్ గార్త్ ఏడు ఫైట్లలో విజేతగా నిలిచాడు. కానీ ఇంగ్లిష్ హెవీవెయిట్ బాక్సింగ్ టైటిలే అతని చివరి విజయంగా నిలిచింది.