శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : మంగళవారం, 11 డిశెంబరు 2018 (14:23 IST)

తెలంగాణ ఎన్నికలు : చిత్తుగా ఓడిన తెరాస మంత్రులు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాసకు చెందిన ఇద్దరు మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. వీరిలో ఒకరు గతంలో కాంగ్రెస్ నేతగా, మంత్రిగా పని చేసి తెరాసలోకి జంప్ అయ్యారు. ఈయన పేరు జూపల్లి కృష్ణారావు. గత తెరాస సర్కారులో మంత్రిగా పని చేశారు. 
 
ప్రస్తుతం ఈయన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన తన సమీప అభ్యర్థి కాంగ్రెస్‌కు చెందిన బీరం హర్షవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 
 
అలాగే, ఖమ్మం జిల్లా పాలేరులో తెరాస సీనియర్‌ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన సమీప ప్రత్యర్థి కందాళ ఉపేందర్‌ రెడ్డి చేతిలో కేవలం 1,950 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు.