Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ కాన్ఫిడెంట్ : 80 సీట్లు ఖాయం...

Updated: శుక్రవారం, 7 డిశెంబరు 2018 (17:29 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అయితే, తెరాస నేత, తాజా మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
ఆయన తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కేటీఆర్ స్పందిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి బాగుందన్నారు. ఎన్నికల్లో తమ పార్టీకే సానుకూల ఫలితాలు రాబోతున్నాయన్నారు. 
 
మూడింట రెండు వంతుల మెజారిటీతో తెరాస విజయఢంకా మోగించబోతోందన్నారు. అంటే ఖచ్చితంగా 80 సీట్లలో విజయకేతనం ఎగురవేస్తారని తెలిపారు. సో.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీపై మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. 

అన్నీ చూడండి

నా కుమార్తెకు పెళ్లి చేసే వయసు వచ్చింది.. ఇపుడు నాకు పెళ్లేంటి? : సురేఖావాణి

Rashmika injured : తీవ్రంగా గాయపడ్డ రశ్మిక మందన్న, ఆరు వారాలు విశ్రాంతి

చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంతో కాళాంకి భైరవుడు

Sudheer : మదర్ సెంటిమెంట్ తో సుధీర్స్ జోకర్, తల్లిగా అభిరామి

క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో రంగులు మార్చే మనిషి కకథగా నిరమ్ ట్రైలర్

తర్వాతి కథనం
Show comments