బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 4 డిశెంబరు 2023 (15:06 IST)

నా గోస తగిలి భారాస ఓడింది: ములుగు ఎమ్మెల్యే సీతక్కపై పూలవర్షం

Seethakka
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఘోరంగా ఓడిపోవడం వెనుక తన గోస వున్నదని ములుగు ఎమ్మెల్యే అనసూయ(సీతక్క) అన్నారు. ప్రజల ఇక్కట్ల నుంచి గట్టెక్కించేందుకు నేను చేపట్టిన కార్యక్రమాలను ఎగతాళి చేసారనీ, ఆ అవమానాలను ఎదుర్కొంటూ నేను పడిన గోస నేడు భారాసకి తగిలి ఓడిపోయిందని ఆమె అన్నారు.
 
తనను ఎలాగైనా ఓడించాలని భారాస నాయకులు డబ్బు కట్టలతో నియోజకవర్గంలో కలియదిరిగి వాటిని పంచారని ఆరోపించారు. ఐతే ములుగు ప్రజలు వారి ఎత్తులను చిత్తు చేసి తనను గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం రాబోతోందనీ, ములుగు నియోజకవర్గానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మంచిరోజులు వచ్చాయని సీతక్క అన్నారు. మరోవైపు ములుగు నియోజకవర్గ ప్రజలు సీతక్కను విజయం సాధించక మునుపే ఆమెపై పూలవర్షం కురిపించి సంబురాలు చేసుకున్నారు.