బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (15:35 IST)

హైదరాబాద్‌ ఓటర్లలో సోమరితనం- మరీ అంత బద్ధకమైతే ఎలా?

telangana assembly
హైదరాబాద్‌లోని ఓటర్లలో సోమరితనం అధికమని తాజా పోలింగ్ నిరూపించింది. దాదాపు 42 రోజుల పాటు వీధుల్లో ప్రతిధ్వనించిన సుదీర్ఘ ప్రచార సీజన్ ఏ మాత్రం ఫలించలేదు. గురువారం ఉదయం, వీధులు, రహదారుల వెంబడి పోలింగ్ కేంద్రాలు ఏర్పడ్డాయి.  
 
కానీ హైదరాబాద్ ఓటర్లు మాత్రం ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెనక్కి తగ్గారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ఊపందుకోగా, వివిధ ప్రాంతాల ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటుండగా, హైదరాబాద్‌ నుంచి మాత్రం స్పందన లేకుండా మూగబోయింది.
 
సామాన్యుల దైనందిన జీవితానికి దూరమైన సెలబ్రిటీలు కూడా తమ ఓటు వేయడానికి క్యూలైన్లలో చేరారు. ముఖ్యంగా, వృద్ధులు, వికలాంగులు, రోగులు ఎన్నికలలో చురుకుగా పాల్గొన్నారు. కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం లేటుగా క్యూలైన్లలోకి వచ్చారు. 
 
హైదరాబాద్‌లో మొత్తం ఓటింగ్ శాతం కేవలం 13 శాతంగా ఉంది. వివిధ జిల్లాల్లో సగటున 35 శాతంగా ఉంది. ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేందుకు హైదరాబాద్ ఓటర్లు ఇష్టపడకపోవటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.